ఈవీఎంలలో డేటా ఎన్నేళ్లు ఉంటుందంటే?

ఈవీఎం వ్యవస్థను అత్యంత సురక్షితమైన, కచ్చితమైన ఓటింగ్ ప్రక్రియగా ఈసీ పేర్కొంటుంది.

Update: 2024-05-14 08:10 GMT

దిశ ప్రతినిధి,విజయవాడ: ఏపీలో ఎన్నికల పోలింగ్ సోమవారం ముగిసింది. ఓటర్లు వేసిన ఓట్లు ఈవీఎంల ద్వారా భద్రపరచడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈవీఎం వ్యవస్థను అత్యంత సురక్షితమైన, కచ్చితమైన ఓటింగ్ ప్రక్రియగా ఎన్నికల సంఘం (ఈసీ) పేర్కొంటుంది. ప్రస్తుతం 2006 తర్వాత వచ్చిన EVM మోడల్స్‌ను వినియోగిస్తున్నారు. ఒక్క ఈవీఎంలో 2వేల ఓట్ల వరకు నమోదు చేయవచ్చు. ఈసీఐఎల్, భారత్ ఎలక్ట్రానిక్స్ సంయుక్తంగా రూపొందించిన ఈ మెషీన్లు 15 ఏళ్ల వరకు పని చేయగలవు. ఇందులో కంట్రోల్ యూనిట్ మనం వేసిన ఓట్లకు సంబంధించిన డేటాను 10 ఏళ్ల వరకు స్టోర్ చేయగలదు.

Similar News