50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు.. చంద్రబాబు కీలక హామీ

ఏపీలో గిరిజనులు తీసుకొచ్చిన 16 పథకాలను రద్దు చేశారా లేదా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు....

Update: 2024-05-09 08:52 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో గిరిజనులు తీసుకొచ్చిన 16 పథకాలను రద్దు చేశారా లేదా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. విజయనగరం జిల్లా కురుపాంలో ప్రజాగళం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తాము తీసుకొచ్చిన పథకాలను జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే రద్దు చేశారని మండిపడ్డారు. తాము అధికారంలో ఉన్నప్పుడు గిరి గోరు ముద్ర తీసుకొస్తే ఇప్పుడు ఆ పథకం ఏమైంది అని ప్రశ్నించారు. తన హయాంలో బాక్సైట్‌ను రద్దు చేస్తే జగన్ అధికారంలోకి రాగానే తవ్వకాలు ప్రారంభించారని మండిపడ్డారు.  కురుపాంలో అల్లూరి సీతారామరాజు మ్యూజియంను తీసుకొస్తే ఆపేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 

స్థానిక ఉద్యోగాలు గిరిజనులకు ఇచ్చేందుకు తాను తీసుకొచ్చిన జీవో నెం.3 రద్దు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. జీవో నెం.3ను మళ్లీ తీసుకొస్తామని, స్థానికులకే ఉద్యోగాలు ఇప్పిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. గిరిజనుల ప్రాంతంలో ఒక్క రోడ్డైనా వేశారా అని ప్రశ్నించారు. రోడ్లను గోతుల మయం చేశారని మండిపడ్డారు. అదే గోతిలో వైసీపీని బూడ్చి పెట్టండని పిలుపునిచ్చారు. జగన్ ప్రజల బిడ్డ కాదని, క్యాన్సర్ గడ్డ అని చెప్పారు. శరీరంలో క్యాన్సర్ గడ్డ వస్తే తీసేస్తారా లేదా అని నిలదీశారు. ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్‌, మోడీ గ్యారంటీలతో వస్తున్నామని చెప్పారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Read More..

కాంగ్రెస్ నేత శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలను ఖండించిన చంద్రబాబు 

Tags:    

Similar News