ఏపీలో వాలంటీర్లపై భారీగా ఫిర్యాదులు.. ఈసీ సంచలన నిర్ణయం

by Disha Web Desk 16 |
ఏపీలో వాలంటీర్లపై భారీగా ఫిర్యాదులు.. ఈసీ సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో మే 13న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని ఈసీ నిబంధన పెట్టింది. అయితే ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. కొందరు వార్డు వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు యదేచ్ఛగా వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా ఎన్నికల ప్రచారంలో వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. 46 మందిపై వేటు వేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సందర్భంగా ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ బుధవారం మీడియాతో మాట్లాడారు. ఈసీ నిబంధనలు ఉల్లంఘనపై ఆయన సీరియస్ అయ్యారు. ఇప్పటి వరకూ 392 ఫిర్యాదు వచ్చాయని చెప్పారు. వాలంటీర్లు, కాంట్రాక్టు ఉద్యోగులపైనే ఎక్కువగా ఫిర్యాదు అందాయని తెలిపారు. మొత్తం 46 మంది చర్యలు తీసుకున్నామని, కొందరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించామని చెప్పారు. ప్రజా ప్రతినిధుల కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనవద్దని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలపై రాజకీయ నేతల ఫొటోలు, ఫెక్సీలు, యాడ్స్ తొలగించాల్సిందేనన్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా లక్షా 99 వేల పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగులు తొలగించామని చెప్పారు. 385 ఎఫ్ఐఆర్ ను నమోదు చేశామన్నారు. 3 రోజుల్లో మూడు కోట్ల 39 వేల రూపాయాలతో పాటు మద్యం సీజ్ చేశామని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు ఉంటాయని.. కేసులు నమోదు చేస్తాయని సీఈవో ముఖేశ్ కుమార్ హెచ్చరించారు.

Read More..

పత్తిపాడులో వాలంటీర్ల చిచ్చు.. టీడీపీ ఇంచార్జ్ కారుపై దాడి.. ఉద్రిక్తత


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed