Kia Carens carకు అవార్డు.. గర్వకారణమన్న వైసీపీ ఎంపీ

రాష్ట్రంలో తయారైన కియా కారెన్స్ కార్‌కు కార్ ఆఫ్ ది ఇయర్-2023 అవార్డు లభించడం రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని రాజ్యసభ సభ్యుడు, విజయసాయిరెడ్డి పేర్కొన్నారు...

Update: 2023-01-20 15:41 GMT

దిశ,ఏపీ బ్యూరో: రాష్ట్రంలో తయారైన కియా కారెన్స్ కార్‌కు కార్ ఆఫ్ ది ఇయర్-2023 అవార్డు లభించడం రాష్ట్ర ప్రభుత్వానికి,  ప్రజలకు గర్వకారణమని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఆయన ట్వీట్ చేస్తూ అనంతపురంలో స్థాపించిన కియా 2019లో 57719 యూనిట్లు ఉత్పత్తి చేయగా 2021లో 2.27 లక్షలకు చేరిందని గుర్తు చేశారు. ఏపీలో తయారవుతున్న కియా కార్లు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేయడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు.

అంబేద్కర్ స్మృతివనం సిద్ధం

విజయవాడ స్వరాజ్ మైదానం లో నిర్మిస్తున్న అంబేద్కర్ స్మృతివనం పనులు చివరి దశకు చేరుకున్నాయని విజయసాయి రెడ్డి తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జన్మదినం సందర్భంగా స్మృతివనంలో 125 అడుగుల ఎత్తుగల ఆయన కంచు లోహ విగ్రహం ఏప్రిల్ 14న ఆవిష్కరించనున్నామని చెప్పారు. రాష్ట్రంలో నిరుపేదల, అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు ఇది నిదర్శనమని విజయసాయిరెడ్డి అన్నారు.

ఇవి కూడా చదవండి : Ap News: కియాపై కీచులాట...క్రెడిట్‌పై TDP,YCP సిగపట్లు

Tags:    

Similar News