Breaking: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట.. ఇప్పట్లో అరెస్ట్ లేనట్టే..?

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది...

Update: 2024-05-23 16:18 GMT

దిశ, వెబ్ డెస్క్: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. జూన్ 5 వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. పిన్నెల్లి సహా ఎమ్మల్యే అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారించిన కోర్టు వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలని, ఫలితాలు ముగిసే వరకూ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయొద్దంటూ అభ్యర్థులకు షరతులు విధించింది. తదుపరి విచారణను జూన్ 6కు వాయిదా వేసింది. 

కాగా ఎన్నికల పోలింగ్ వేళ మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారు. దీంతో ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఆయనపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు పిన్నెల్లిపై 10 సెక్షన్ల వరకూ కేసులు నమోదు చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పిన్నెల్లి తెలంగాణకు పరారయ్యారు. సంగారెడ్డి వద్ద పిన్నెల్లి డ్రైవర్‌తో పాటు గన్‌మెన్‌ను అరెస్ట్ చేశారు. పిన్నెల్లిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జూన్ 5 వరకు బిగ్ రిలీఫ్ లభించింది. 

Similar News