పాపం ఆర్టీసీ బస్సు డ్రైవర్.. ఇలా బుక్కయ్యాడేంటి..?

గుంటూరు జిల్లా పత్తిపాడులో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ మద్యం కోసం చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది...

Update: 2024-05-23 16:08 GMT

దిశ, వెబ్ డెస్క్: మద్యం ఏ పనైనా చేస్తుంది.. చేయిస్తుంది. అలవాటు పడితే అన్నింటిని మర్చియేలా చేస్తుంది. ఉద్యోగి, కూలీ, మేనేజర్, డ్రైవర్, కార్మికుడు, దర్జీ, పేయింటర్, మేస్ట్రీ, ప్రభుత్వ అధికారి, చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా బానిసలను చేస్తుంది. సాయంత్రం అయితే ఒక్క పెగ్గు వేసుకో అని చెబుతోంది. కుటుంబాల్లో చిచ్చు పెడుతుంది. భర్తను తాగుబోతును చేస్తుంది. భార్యకు కన్నీళ్లు తెప్పిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

తాజాగా ఈ మద్యం ఓ డ్రైవర్ ఉద్యోగానికి టెండర్ తెచ్చి పెట్టింది. గుంటూరు జిల్లా పత్తిపాడులో ఓ ఆర్టీసీ బస్సు డ్రైవర్ మద్యం కోసం చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పర్చూరు వైపు నుంచి గుంటూరు వెళ్తూ పత్తిపాడుకు బస్సు చేరుకుంది. డ్రైవర్ కంట్లో పక్కనే ప్రభుత్వ మద్యం షాపుపై పడింది. వెంటనే బస్సును ఆపి, పరిగెత్తుకుంటూ రోడ్డు దాటి ప్రభుత్వ దుకాణం వద్దకు వెళ్లి మద్యం సీసా కొనుగోలు చేసి జేబులో పెట్టుకున్నారు. అనంతరం పరిగెత్తుకుంటూ మళ్లీ వచ్చి బస్సు ఎక్కి నడుపుకుంటూ గుంటూరు వైపు వెళ్లారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఆర్టీసీ డ్రైవర్ చేసిన పనికి నెటిజన్లు అయితే చురకలు వేస్తున్నారు. మరి ఆర్టీసీ అధికారులు చర్యలు ఎలా ఉంటాయో చూడాలి. 

Similar News