Nara Lokesh: వైజాగ్ లో విజయసాయి రెడ్డి రాసలీలలు.. బయటపడతాయనే భయం.. అందుకే..?

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేత విజయసాయి రెడ్డి హస్తం కూడా ఉందని ఈడి అరెస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే.

Update: 2024-03-22 10:04 GMT

దిశ వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వైసీపీ నేత విజయసాయి రెడ్డి హస్తం కూడా ఉందని ఈడి అరెస్ట్ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం మరో సారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చిన విషయం అందరికి సుపరిచితమే. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఓ బ్రెజిల్ లో మీకున్న చీకటి వ్యాపారాల గురించి రెండేళ్ళ క్రిందటే చెప్పాను. ఇప్పుడు అదే నిజం అయ్యింది.

అనే ట్యాగ్ లైన్ తో వీడియోని పోస్ట్ చేశారు. ఆయన లావాదేవీలు బయటపడతాయో.. లేక వైజాగ్ లో ఉన్న ఆయన రాసలీలలు బయటపడతాయో.. లేదంటే బ్రెజిల్ లో ఆయన, ఆయన కుటుంబసభ్యులు చేస్తున్న అవీనీతి బయటపడుతుందో, లేక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఉన్న ఈయన పాత్ర బయటపడుతుందో అనే భయం విజయసాయి రెడ్డికి పట్టుకుందని పేర్కొన్నారు.

అందుకే తన ఫోన్ పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు విజయసాయి రెడ్డి, దీనితో యావత్ ఆంధ్ర రాష్ట్ర పోలీసు డీజీపీ నుండి కానిస్టేబుల్ వరకు విజయసాయి రెడ్డి ఫోన్ వెతికే పనిలో పడ్డారని ఎద్దేవ చేశారు. ఒక రాజ్య సభ సభ్యుడు, జగన్మోహన్ రెడ్డికి చాల దగ్గర వ్యక్తి, అలానే అన్నీ కుంభకోణాల్లో నెంబర్ 2 ఈయనే.. అలాంటి వ్యక్తి ఫోన్ పోతే.. ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అలోచాలి అన్నారు. వాస్తవంగా ఒక మాట చెప్పాలంటే దొంగోడి ఇంట్లో దొంగ పడినట్లు ఉంది అని ఎద్దేవ చేశారు.  కాగా ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. 

Tags:    

Similar News