AP Elections 2024: ప్రగతి పథంలో కాదు పథకాల బాటలోనే నా పయనం.. సీఎం జగన్..

ప్రగతి పథంలో నడిపించేవాడు, బానిసలా బతకవద్ధని, బద్దకాన్ని వదిలి కష్టించే తత్వాన్ని అలవరుచుకోవాలని చెప్పి ప్రజలను చైతన్యపరిచేవాడు నాయకుడు.

Update: 2024-05-10 11:12 GMT

దిశ వెబ్ డెస్క్: ప్రగతి పథంలో నడిపించేవాడు, బానిసలా బతకవద్ధని, బద్దకాన్ని వదిలి కష్టించే తత్వాన్ని అలవరుచుకోవాలని చెప్పి ప్రజలను చైతన్యపరిచేవాడు నాయకుడు. కాని తాజాగా ఏపీ సీఎం చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రజలను బద్దకానికి బ్రాండ్ ఎంబాసిడర్‌ను చేసేలా ఉన్నాయని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని, ఈ ఎన్నికలు ఎమ్మెల్యే, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావని, రాబో ఐదేళ్లలో పథకాల కొనసాగింపుకి, ముగింపుకి మధ్య జరుగుతున్న ఎన్నికలు అని పేర్కొన్నారు.

రానున్న ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేస్తే పథకాల కొనసాగింపు టీడీపీకి వేస్తే పథకాల ముగింపు అని పేర్కొన్నారు. కాగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, రాష్ట్ర అభివృద్ధి కోసం కంపెనీలను తెస్తాననిగాని, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాను అని హామీ ఇవ్వలేకపోతున్నారని పలువురు మండిపడుతున్నారు. ప్రజలకు ఉపాధి కల్పించం, కేవలం ఉచిత పథకాలను కొనసాగిస్తాం అని చెప్పకనే చెబుతున్నారా అని కొంతమంది సీఎం జగన్‌ను ఎద్దేవ చేస్తున్నారు.  


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News