రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు.. పిఠాపురంలో ప్రచారంపై క్లారిటీ

పార్లమెంట్ ఎన్నికల వేళ రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని ప్రకటించారు.

Update: 2024-05-10 09:57 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ రాజకీయాలపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను రాజకీయాలకు అతీతంగా ఉన్నానని ప్రకటించారు. పవన్ కల్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలోనూ ప్రచారానికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. తనపై సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలన్నీ అవాస్తవం అని కొట్టిపారేశారు. పద్మవిభూషణ్ పురస్కారం తన అభిమానులది అని చిరంజీవి చెప్పారు. ఏ సమయానికి ఏది రావాలో అవే వస్తాయని వ్యాఖ్యానించారు.

ఆశపడితే అవార్డులు రావని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రావాలనుకోవడం సముచితమని చెప్పుకొచ్చారు. ఎంజీఆర్‌కు వచ్చినప్పుడు ఎన్టీఆర్‌కు రావాలన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న రావాలని నేను కోరుకుంటున్నానని చిరంజీవి పేర్కొన్నారు. పిఠాపురానికి తాను రావాలని కళ్యాణ్ ఎప్పుడు కోరుకోరని చిరంజీవి ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. తాను కంఫర్డ్‌గా ఉంచాలనుకుంటారని వివరించారు. కాగా, గత కొంతకాలంగా చిరంజీవి పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేస్తారని వార్తలు విస్తృతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వయంగా పుకార్లపై చిరు క్లారిటీ ఇచ్చారు.

Read More...

పవన్ కల్యాణ్ రీమేక్‌తో అఖీరా ఇండస్ట్రీ ఎంట్రీ.. సీన్ చిత్రీకరణ కూడా జరిగినట్లుందే (వీడియో) 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News