ప్రతి గ్రామంలో అభివృద్ధి అంటే ఏంటో చూపించాం..సజ్జల కీలక వ్యాఖ్యలు!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశారు. ఓ వైపు పార్టీ నేతలు సభలో, మరోవైపు పార్టీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారంతో దూసుకెళ్తున్నారు.

Update: 2024-05-10 09:57 GMT

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉంది. దీంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారం ముమ్మరం చేశారు. ఓ వైపు పార్టీ నేతలు సభలో, మరోవైపు పార్టీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారంతో దూసుకెళ్తున్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ఓటర్లను తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులపై మాటాలు తూటాల్లా పేలుతున్నాయి. ఇది ఇలా ఉంటే..సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రతిపక్ష పార్టీల పై ప్రశ్నల వర్షం కురిపించాడు. దేశ GDP లో రాష్ట్ర వాటా 4.82 శాతానికి పెరగడం అభివృద్ధి కాదా? అని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్థారెడ్డి విపక్షాలను ప్రశ్నించాడు. ప్రతి గ్రామంలో అభివృద్ధి అంటే ఏంటో చూపించాం అన్నారు. సచివాలయం, RBKలు, విలేజ్ క్లినిక్‌లు నిర్మించాం అని చెప్పారు. విద్య, వైద్య రంగాల్లో ఎన్నో సంస్కరణలు తెచ్చాం. నాడు-నేడుతో వాటి రూపురేఖలు మార్చాం అని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల ద్వారా కోటి కుటుంబాలు సొంత కాళ్లపై నిలబడేలా చేశాం అని తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News