బ్రేకింగ్: CM జగన్‌కు ఎంపీ రఘురామరాజు ఊహించని షాక్..!

ఢిల్లీలో మంగళవారం జరిగిన గ్లోబర్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో త్వరలోనే విశాఖ ఏపీ రాజధాని కాబోతుందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Update: 2023-01-31 14:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో మంగళవారం జరిగిన గ్లోబర్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో త్వరలోనే విశాఖ ఏపీ రాజధాని కాబోతుందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఏపీ రాజధాని అంశం సుప్రీంకోర్టు విచారణలో ఉండగా.. సీఎం హోదాలో ఉండి జగన్ రాజధాని గురించి మాట్లాడటం సరికాదంటూ ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో సీఎం జగన్ సొంత పార్టీ ఎంపీ రఘురామరాజు ఊహించని షాక్ ఇచ్చారు. ఏపీ రాజధాని విశాఖ అంటూ ప్రకటన చేసి సీఎం జగన్ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని భారత చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు లేఖ రాశారు. రాజధాని అంశం సుప్రీంకోర్టులో విచారణ వేళ జగన్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారని.. నిబంధనల ప్రకారం జగన్ కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని లేఖలో పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ వ్యవహారాల్లో జోక్యం చేసుకునేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని.. జగన్ వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలని ఎంపీ రఘురామ లేఖలో కోరారు. కాగా, సీఎం జగన్‌కు వ్యతిరేకంగా వైసీపీ పార్టీ ఎంపీ ఏకంగా చీఫ్ జస్టిస్‌కు లేఖ రాయడం వైసీపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  

Tags:    

Similar News