జనసేనలో చేరిన మాజీ మంత్రి.. ఆహ్వానించిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వరుసగా ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం.. ఆయా పార్టీల్లో అసంతృప్తులు ఒక్కసారిగా బయటపడటం జరుగుతున్నాయి.

Update: 2024-02-26 14:10 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వరుసగా ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం.. ఆయా పార్టీల్లో అసంతృప్తులు ఒక్కసారిగా బయటపడటం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజీనామాలు సైతం చేస్తున్నారు. ఈ క్రమంలో మరో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తాజాగా కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరారు. ఆయనకు హైదరాబాద్‌లోని పవన్ కల్యాణ్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రాబోయే ఎన్నికల్లో జనసేన విజయానికి కృషి చేయాలని ఆయన్ను పవన్ కోరారు. అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కొత్తపల్లి సుబ్బారాయుడి చేరికతో పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి కొత్త ఉత్సాహం వస్తుందని అభిప్రాయపడ్డారు. ఆయన సేవలు పార్టీకి ఎంతో ఉపయోగకరం అని పేర్కొన్నారు. రాజకీయాల్లో కొత్తపల్లి సుబ్బారాయుడి అనుభవం జనసేన విజయానికి దోహదం చేస్తుందని అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలోనూ కీలకంగా పనిచేశారని కొనియాడారు.

Tags:    

Similar News