Heavy Rains: కంటతడి పెడుతున్న ఉద్యాన పంట రైతులు

ఏపీలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసాయి.

Update: 2024-05-25 11:03 GMT

దిశ వెబ్ డెస్క్: ఏపీలో పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసాయి. ఏకదాటిగా కురిసిన వర్షలకు పలు చోట్ల వాగులు వంకలు పొంగిపొరులుతున్నాయి. పంట పొలాలు చెరువులని తలపిస్తున్నాయి. అలానే విధ్యుత్ స్థంబాలు, చెట్లు నేలకొరిగాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కురిసిన కుండపోత వర్షాలకు, బెళుగుప్ప మండలం, అంకంపల్లి, దుద్దేకుంట గ్రమాల్లో ఉద్యాన పంటలు నేలకొరిగాయి.

బొప్పాయి, అరటి తోటలు నేలమట్టం అయ్యాయి. దీనితో లక్షల్లో నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు పంట నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం అందించాలని రైతులు కోరారు. 

Similar News