విజయనగరం జిల్లా రాజాంలో ఉద్రిక్తత.. రంగంలోకి పోలీసులు

విజయనగరం జిల్లా రాజాంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాజు ఆఫీస్ ముందు ఉంచిన కారు వద్ద నిల్చున్న ఇద్దరు మైనర్లపై రాజు అనుచరులు చేశారు.

Update: 2024-05-25 13:51 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయనగరం జిల్లా రాజాంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రాజు ఆఫీస్ ముందు ఉంచిన కారు వద్ద నిల్చున్న ఇద్దరు మైనర్లపై రాజు అనుచరులు చేశారు. కారులో వస్తువలను దొంగిలించడానికి వచ్చారంటూ.. మైనర్లను వారి ఆఫీస్ లోకి తీసుకెళ్లి చితకబాదారు. దీంతో మైనర్లకు తీవ్ర గాయాలు కాగా.. వారిని రాజాం ఆస్పత్రికి తరలించారు. ఈ సమాచారం అందుకున్న మైనర్ల బంధువులు రాజు ఆఫీసు వద్దకు భారీగా చేరుకుని కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో ఒక్కసారిగా అక్కడి వాతావరణ ఉద్రిక్తంగా మారింది. రంగంలోకి దిగిన పోలీసులు మైనర్ల బంధువులను చెదరగొట్టారు. కాగా ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. మైనర్లు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. బంధువులు మాత్రం రోడ్డుపై బైఠాయించి తమ పిల్లలపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆందోళన చేస్తున్నారు.

Similar News