BJP రాష్ట్ర అధ్యక్షుడికి చేదు అనుభవం

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. విశాఖపట్నంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మిషన్ కర్మయోగి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం హాజరయ్యారు. అయితే సోము వీర్రాజు

Update: 2022-11-22 07:53 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. విశాఖపట్నంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మిషన్ కర్మయోగి ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం హాజరయ్యారు. అయితే సోము వీర్రాజును లోపలికి వెళ్లకుండా సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినైన తనను లోలపికి పంపించరా అంటూ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఐఎస్ఎఫ్ సిబ్బందికి సోము వీర్రాజు మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఈ విషయం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి వెళ్లింది. సోము వీర్రాజును లోపలికి వదలాలని ఆదేశించడంతో అప్పుడు సీఐఎస్ఎఫ్ సిబ్బందికి లోపలికి పంపించారు. సీఐఎస్ఎఫ్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన సోము వీర్రాజును అధికారులు శాంతింపజేసే ప్రయత్నం చేశారు. సీఐఎస్ఎఫ్ సిబ్బందికి నాయకులపై అంతగా అవగాహన లేదని వివరించే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో విశాఖలో భారీ భద్రత ఏర్పాటు చేశారు. విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేసి, హైఅలర్ట్ ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నిరసనల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. నేషనల్ హైవేపై ప్రతి వాహనాన్ని తనిఖీ చేసిన తర్వాతే ముందుకు అనుమతిస్తున్నారు.

Tags:    

Similar News