ఆయన మార్గదర్శకాలతో నడిస్తేనే ఏపీకి భవిష్యత్తు...!

చంద్రబాబు మార్గదర్శకాలతో నడిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని టీడీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు అన్నారు.

Update: 2023-10-09 14:47 GMT

దిశ, కళ్యాణదుర్గం: చంద్రబాబు సూచించిన మార్గదర్శకాలతో నడిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు అన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎమ్మెస్ రాజు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు.


ఈ దీక్షకు కళ్యాణదుర్గం నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్బంగా ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ ఈ రోజు సైకో జగన్ రెడ్డితో రాష్ట్రం సర్వనాశమవుతుందని విమర్శించారు. సొంత నాయకులే వైసీపీని చీదరించుకునే స్థాయికి వచ్చారంటే ఆ పార్టీ నాయకులు ఏ స్థాయికి దిగజారారో అర్థం చేసుకోవచ్చన్నారు. అందుకే ప్రజలు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ఉమామహేశ్వర నాయుడు తెలిపారు.

Tags:    

Similar News