నీళ్ల కోసం పొట్టుపొట్టు కొట్టుకున్న మహిళలు.. ఆ పంచాయితీని సైతం వదలని వైసీపీ నేతలు..

అనంతపురం జిల్లాలోని డి. హీరేహాల్ మండలం సిద్దాపురంతండాలో వైసీపీ, టీడీపీ నాయకులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

Update: 2024-05-24 07:14 GMT

దిశ వెబ్ డెస్క్: అనంతపురం జిల్లాలోని డి. హీరేహాల్ మండలం సిద్దాపురంతండాలో వైసీపీ, టీడీపీ నాయకులు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శుద్ద జల ప్లాంట్ వద్ద సిద్దాపురంతండాకు చెందిన మహిళలు తాగునీరు పట్టుకుంటున్న సమయంలో మహిళల మధ్య గొడవ నెలకొంది. ఈ నేపథ్యంలో మహిళల గొడవలో వైసీపీ నాయకులు జోక్యం చేసుకున్నారు.

దీనితో వైసీపీ నాయకులును అడ్డుకునేందుకు టీడీపీ నాయకులు వచ్చారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులపై వైసీపీ నాయకులు దాడిచేశారు. ఈ దాడిలో 6 మంది టీడీపీ నాయకులు గాయపడ్డారు. కాగా గాయపడ్డిన టీడీపీ నాయకులును బళ్లారి విమ్స్‌కు తరలించారు. కాగా విషయం తెలుసుకున్న డి. హీరేహాల్ పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. 

Similar News