బిగ్ బి మెచ్చిన RGV ‘డి కంపెనీ’

54

దిశ, వెబ్‌డెస్క్: ఆర్జీవీ.. గ్యాంగ్‌స్టర్ సినిమాల డైరెక్షన్‌కు కేరాఫ్ అడ్రస్. ‘సత్య’ ‘కంపెనీ’ లాంటి సినిమాలు తీసి సూపర్ హిట్ అందుకున్న వర్మ.. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘డి కంపెనీ’ పేరుతో తెరకెక్కుతున్న సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన వర్మ.. గల్లీ రౌడీగా ఉన్న దావూద్ ఇబ్రహీం ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడనేది చూపించబోతున్నాడు. ఈ క్రమంలో డి కంపెనీ ఎలా స్థాపించాడు? బిల్ గేట్స్, ధీరూభాయి అంబానీ విజనరీ చుట్టూ కథ తిరగనుండగా.. వందల మందిని బలిగొన్న ముంబై బాంబ్ బ్లాస్ట్‌కు దావూద్‌కు ఉన్న సంబంధాన్ని కూడా ఇందులో చూపించనున్నాడు. దీనితో పాటు డి కంపెనీ నీడలో ఎదిగిన గ్యాంగ్ స్టర్స్, నమ్మక ద్రోహం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకున్న రౌడీల గురించి బిగ్ స్క్రీన్‌పై ప్రెజెంట్ చేయబోతున్నాడు.

స్పార్క్ ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తున్న సినిమా ట్రైలర్‌కు బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫిదా అయ్యారు. వర్మను సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. డి కంపెనీ ట్రైలర్‌ను షేర్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. కాగా, ఈ సినిమాను తెరకెక్కించేందుకు పదేళ్లుగా గ్రౌండ్ వర్క్ చేశారట ఆర్జీవీ.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..