‘నిసర్గ’ అప్రమత్తతపై అమిత్ షా రివ్యూ

by  |
‘నిసర్గ’ అప్రమత్తతపై అమిత్ షా రివ్యూ
X

న్యూఢిల్లీ: ‘నిసర్గ’ తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్‌డీఎంఏ, ఎన్‌డీఆర్ఎఫ్, ఐఎండీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అరేబియా సముద్రంలో బలపడుతున్న తుఫాన్ ఈ నెల మూడు, నాలుగు తేదీల్లో మహారాష్ట్ర, గుజరాత్ కోస్తా తీరాలు, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలను ముంచెత్తే ప్రమాదమున్నదని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్తగా నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్(ఎన్‌డీఆర్ఎఫ్) తొమ్మిది బృందాలను మహారాష్ట్రలో రంగంలోకి దింపింది. కాగా, గుజరాత్‌లో 11 ఎన్‌డీఆర్ఎఫ్ టీమ్స్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలో ఒక్కో బృందం చొప్పున మోహరించాయి.

Next Story

Most Viewed