ఫేక్ జీపీఎస్‌తో రమ్మీ ఆడిన వ్యక్తి.. తీరా చూస్తే షాక్!

by  |
ఫేక్ జీపీఎస్‌తో రమ్మీ ఆడిన వ్యక్తి.. తీరా చూస్తే షాక్!
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆన్‌లైన్ రమ్మీ గేమ్‌ను ఆడవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్న ఎవరూ వినడం లేదు. ఆన్‌లైన్ జూదం వ్యసనంలా మారి చాలా మంది డబ్బులు కోల్పోయి రోడ్డున పడుతుండగా, మరికొందరు అప్పులు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఆన్‌లైన్ రమ్మీ బ్యాన్ విధించింది. పోలీసులు కూడా రమ్మీ లాంటి గేమ్స్ ఆడకూడదని సోషల్ మీడియా మాద్యమాల ద్వారా ప్రచారం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే అంబర్ పేటకు చెందన ఓ వ్యక్తి ఆన్ లైన్ రమ్మీ ఆడి రూ.70లక్షలు పొగొట్టుకున్నాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయగా, బ్యాన్ చేసిన లింక్ ఎలా ఓపెన్ అయిందని అతన్ని పోలీసులు ప్రశ్నించారు. అయితే, ఫేక్ జేపీఎస్ ద్వారా రమ్మీ ఆడానని బాధితుడు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు ప్రకటించారు.ఇకమీదట అయినా ఇలాంటి ఆన్ లైన్ గేమ్స్ జోలికి వెళ్లకూడదని సూచించారు.


Next Story

Most Viewed