ఫ్యాన్స్ కు ఇక పూనకాలే.. సర్‌ప్రైజ్ గిఫ్ట్ ప్లాన్ చేసిన ‘టక్ జగదీశ్’ ?

by  |
jagadish
X

దిశ, సినిమా : నేచురల్ స్టార్ నాని, రితూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘టక్ జగదీశ్’. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, జగపతిబాబు, నాజర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. థియేటర్ రిలీజ్ కోసం ఇన్నాళ్లూ వాయిదాపడ్డ సినిమా సెప్టెంబర్ 10న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ ఉందని ప్రకటించాడు నాని. ‘టక్ జగదీశ్’ ఫ్యామిలీలో జాయిన్ అవ్వాలనుకుంటే.. తమ ట్విట్టర్ ప్రొఫైల్ నేమ్‌లో ‘టక్’ యాడ్ చేసి, ట్రైలర్‌లో నచ్చిన విషయాన్ని వన్ వర్డ్‌తో రిప్లయ్స్‌ సెక్షన్‌లో కామెంట్ చేయమని సూచించాడు. అలా చేసిన వారందరి కామెంట్స్‌ను తాను చదువుతానని.. ఈ మేరకు స్పెషల్ సర్‌ప్రైజ్ ఉంటుందని మాటిచ్చాడు.

Next Story