గుండెను కాపాడే చేమదుంపలతో ఎంతో ఆరోగ్యం

by  |
గుండెను కాపాడే చేమదుంపలతో ఎంతో ఆరోగ్యం
X

చాలా తక్కువ మంది వండుకునే చేమదుంపల్లో ఎన్ని పోషకాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. అప్పుడు అవే కొనుక్కుంటారు.
దుంపల్లో కొన్నింటిని పచ్చిగానే తినొచ్చు… కొన్నింటిని వండుకొని తినగలం. చేమ దుంపల్ని వండుకొని మాత్రమే తినగలం. ఇవి జిగురుగా ఉంటాయని చాలా మంది వీటిని తినేందుకు ఇష్టపడరు. నిజానికి వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. చేమ దుంపల్ని ఉడికించి, వేయించి, కాల్చుకుని తినొచ్చు. మాంసానికి బదులుగా వీటిని తింటారని తెలుసా. మంచి రుచినీ, పోషకాలనీ ఇవి ఇస్తాయి. 100 గ్రాముల చేమదుంపల్లో దాదాపు 120 కేలరీల శక్తి ఉంటుంది. వీటిలో ఎక్కువ కాంప్లెక్స్‌ కార్బోహైడ్రేట్స్‌ దొరుకుతాయి. పీచు పదార్థాన్ని నెమ్మదిగా జీర్ణం చేస్తూ రక్తప్రసరణలోకి గ్లూకోజ్‌ను స్థిరంగా విడుదల చేస్తాయి. అందువల్ల షుగర్ లెవెల్స్ సడెన్‌గా పెరగవు. పైగా వీటివల్ల బాడీలో ఎనర్జీ ఎక్కువసేపు ఉంటుంది.

గుండెను కాపాడతాయి : చేమదుంపలు బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి. మిగతా దుంపల లాగే వీటిలో కూడా పిండి పదార్థాలు ఎక్కువే. ఐతే ఇవి గుండెకు చాలా మంచివి. వీటిలోని పీచు, యాంటీ ఆక్సిడెంట్ల కాంబినేషన్‌ ధమనులలో కొవ్వు నిల్వ ఉండకుండా చేస్తుంది. అరుదుగా లభించే విటమిన్‌ బి-6 చేమ దుంపలు తింటే వస్తుంది. గుండెజబ్బులకు, హైపర్‌ టెన్షన్‌కు కారణమయ్యే బ్లడ్‌ హోమోసిస్టిన్‌ స్థాయిలను తగ్గించడానికి అవసరమైన ‘ఇ’ విటమిన్‌ను ఈ దుంపలు అందిస్తాయి. బీపీని సెట్ చేసే పొటాషియం వీటిలో పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు వీటిలో ఉండే డియోస్కోరిన్‌ అనే ప్రోటీన్‌ గుండె జబ్బులూ, హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుతుంది.

జీర్ణం సంపూర్ణం : చేమ దుంపలు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. వీటిలోని డైటరీ ఫైబర్‌ మలబద్ధకాన్ని తగ్గించి, విష పదార్థాలు పేరుకుపోకుండా కాపాడుతుంది. కొలన్‌ క్యాన్సర్‌, ఇర్రిటబుల్‌ బవెల్‌ సిండ్రోమ్‌ల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది.



Next Story