క్రేజీ ఆఫర్.. కోతిని పట్టిస్తే రూ. 500

by  |
క్రేజీ ఆఫర్.. కోతిని పట్టిస్తే రూ. 500
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో కోతులను పట్టించిన వారికి ఒక్కో కోతికి రూ.500 ఇస్తున్నట్టు అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అసెంబ్లీ క్వశ్చన్ అవర్‌లో శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అడిగిన ప్రశ్నకి మంత్రి స్పందించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కోతుల బెడద నుంచి ప్రజలను రక్షించేందుకు రూ.3 కోట్లతో నిర్మల్‌లో కోతుల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి పునరావాస కేంద్రం దేశవ్యాప్తంగా రెండే ఉన్నాయని, మొదటిది హిమాచల్ ప్రదేశ్‌లో ఉందన్నారు. పునరావాస కేంద్రంపై రివ్యూ చేసిన సీఎం కేసీఆర్ రాష్ట్రం మొత్తం వీటిని విస్తరించాలని చెప్పారన్నారు. వీటిని మూడు,నాలుగు జిల్లాలకు ఒకటి ఏర్పాటుచేసి సంతానోత్పత్తిని తగ్గించి కోతుల బెడద నుంచి విముక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.



Next Story

Most Viewed