10 ఏళ్లు గడిచినా విడుదల చేయరా?

by  |
10 ఏళ్లు గడిచినా విడుదల చేయరా?
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: నారాయణపేట జిల్లాలోని సంగంబండ రిజర్వాయర్ పూర్తయి 10 ఏళ్లు గడిచినా.. సాగునీటి కోసం నిరీక్షణ తప్పడం లేదు. ఎడమ లో-లెవల్ కెనాల్ కింద మక్తల్ మండంలోని 9 గ్రామాల పరిధిలో సుమారు 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేయకపోవడంతో సోమవారం అఖిలపక్షం నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలకు నీరు విడుదల అవుతున్నా.. ఎడమ కెనాల్ పరిధిలోని లో-లెవల్ కాలువకు నీరు విడుదల చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నేతలు మండిపడ్డారు.

లో-లెవల్ కెనాల్ కింద మఖ్తల్, మాగనూరు మండలాల పరిధిలో.. దాసర్‌పల్లి, వనయకుంట, చందాపూర్, తిర్లాపూర్, వడ్వాట్, అమ్మపల్లి, ఒబ్లాపుర్ తదితర గ్రామాల్లో 20 వేల ఎకరాల ఆయకట్టు బీడు భూములగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సర్పంచ్ మారెప్ప, ఉప సర్పంచ్ రామచంద్రప్ప, కొండన్న, రవి, బంగారు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed