అందరూ… ఇంటర్ పాస్

by  |
అందరూ… ఇంటర్ పాస్
X

దిశ, ఏపీ బ్యూరో: ఇంటర్మీడియెట్‌ సెకండియర్‌–2020 పరీక్షల్లో ఫెయిలై అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసిన వారందరినీ కంపార్టుమెంటల్‌ కేటగిరీలో పాసైనట్లుగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. వీరికి నిర్వహించాల్సిన అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు కోవిడ్‌–19 నేపథ్యంలో రద్దు చేసి ‘ఆల్‌పాస్‌’గా ప్రభుత్వం ప్రకటించినందున అభ్యర్థులు ఫెయిలైన సబ్జెక్టులన్నిటికీ పాస్‌ మార్కులు వేస్తూ కంపార్టుమెంటల్‌ కేటగిరీలో పాస్‌ చేసినట్లు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ పేర్కొన్నారు. అలాగే ఫస్టియర్‌ పరీక్షలు రాసిన అభ్యర్థులు మార్కుల ఇంప్రూవ్‌మెంట్‌ (బెటర్మెంట్) కోసం 2021 మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే పరీక్షల్లో రాసుకోవాలన్నారు. సెకండియర్‌ పరీక్షలతో పాటు ఫస్టియర్‌ సబ్జెక్టులకు ఇంప్రూవ్‌మెంట్‌ (బెటర్మెంట్ ) పరీక్షలకు హాజరుకావచ్చని ప్రకటన విడుదల చేశారు.

Next Story

Most Viewed