త్వరలో ఆన్‌లైన్‌లో ఆల్కహాల్?

by  |
త్వరలో ఆన్‌లైన్‌లో ఆల్కహాల్?
X

క మద్యం కొనడానికి వైన్ షాపు వరకు వెళ్లాల్సిన పని లేదు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో వస్తువులు ఆర్డర్ చేస్తున్నట్లే మద్యాన్ని కూడా ఆన్‌లైన్‌లో అమ్మబోతున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తున్న మద్యం అమ్మకాల్లో ఈ ఆన్‌లైన్ విధానం తీసుకొస్తే రాబడి రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధిలో ఉన్న రాష్ట్రాలు ఈ విధానాన్ని త్వరగా అమల్లోకి తీసుకురావాలని ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అమృత్ కిరణ్ సింగ్ ఆకాంక్షించారు.

ఇప్పటికే కర్ణాటక రాష్ట్రం ఈ మేరకు చర్యలు చేపట్టిందని, అమ్మకందారుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని పూర్తి స్థాయి వ్యవస్థను సిద్ధం చేస్తోందని ఆయన అన్నారు. అయితే జీఎస్‌టీ పరిధిలో లేకుండా ఎక్కువ ఆదాయాన్ని సమకూరుస్తున్న ఆల్కహాల్ అమ్మకాలను పెంపొందించి లాభాలు పొందడానికి ఆన్‌లైన్ అమ్మకాలు మంచి ఆలోచన అని కిరణ్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం అందరూ ఆన్‌లైన్ కొనుగోళ్ల వైపే ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో ఈ ఆలోచనను అమలు చేయడానికి ఇంతకన్నా మంచి సమయం ఉండదని ఆయన చెప్పారు. ఏదేమైనా మద్యం అమ్మకాలు ఆన్‌లైన్ అయితే ఇక మందుబాబులకి పండగే పండగ.



Next Story

Most Viewed