రోహింగ్యాలకు పాస్ పోర్టులు బోధన్ నుంచే?

by  |
రోహింగ్యాలకు పాస్ పోర్టులు బోధన్ నుంచే?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: బంగ్లాదేశీయులను బోధన్ వాసులుగా గుర్తించి పాస్ పోర్టుల మంజూరు చేసిన విషయం ఇటీవల ఎయిర్ పోర్టు అధికారుల తనిఖీలో వెలుగు చూసింది. అందుకు బాధ్యులైన ఒక ఎస్ఐ, ఏఎస్ఐతో పాటు ఏజెంట్‌ను ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఈ నెల 4న జరిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. బంగ్లాదేశ్‌కు చెందిన రోహింగ్యాలను బోధన్ వాసులుగా గుర్తిస్తు రెండు సంవత్సరాల క్రితం స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్స్ తమ విచారణలో నిర్ధారించారు. వారికి పాస్ పోర్టులు మంజూరు అయ్యాయి.

ఇటీవల ఒక ఫేక్ పాస్ పోర్టుల గ్యాంగ్ పోలిసులకే పట్టుబడింది. దీంతో విచారణ జరిపి ఫేక్ పాస్ పోర్టు తయారు చేసిన ఏజెంట్‌ను, వారికి సహకరించిన హెడ్ కానిస్టెబుల్ ( ప్రస్తుతం సిద్ధిపేటలో ఎస్ఐ ) గా విధులు నిర్వహిస్తున్న మల్లెశ్‌ను, ప్రస్తుతం బోధన్ సబ్ డివిజన్‌లో స్పెషల్ బ్రాంచ్‌లో అప్పుడు హెడ్ కానిస్టెబుల్ ప్రస్తుతం ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న అనిల్‌లను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు సంబందించిన ఒక ఏసీపీ క్యాడర్ అధికారి పలువురు సిబ్బంది వచ్చి విచారణ చెసి ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారు నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి ఎంతమందికి పాస్ పోర్టులు జారీ అయ్యాయి అని ఎస్బీ కార్యాలయంలో ఆరా తీసినట్లు తెలిసింది.


Next Story

Most Viewed