45 లక్షల ఎయిర్ ఇండియా ప్యాసింజర్ల డేటా లీక్

by  |
Air India
X

దిశ, ఫీచర్స్: ఎయిర్ ఇండియా ప్యాసింజర్ సర్వీస్ సిస్టమ్ ప్రొవైడర్ SITA, ఫిబ్రవరిలో అధునాతన రీతిలో సైబర్ అటాక్‌ను ఎదుర్కోగా.. అది ప్యాసింజర్ల పర్సనల్ డేటా లీక్‌కు దారితీసిందని ఎయిర్‌లైన్ సంస్థ వెల్లడించింది. పేరు, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ డీటెయిల్స్, పాస్‌పోర్ట్, క్రెడిట్ కార్డ్ వివరాలతో కూడిన వ్యక్తిగత సమాచారం లీకైనట్టు సంస్థ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఈ మేరకు ప్రపంచవ్యాప్తంగా 2011 ఆగస్టు నుంచి 2021 ఫిబ్రవరి వరకు నమోదైన దాదాపు 45 లక్షల మంది పర్సనల్ డేటాపై ప్రభావం పడనుందని తెలిపింది.

కాగా, ఈ అటాక్స్ గురించి 2021 ఫిబ్రవరి 2న మొదటిసారి ప్రకటించిన ఎయిర్ ఇండియా.. మార్చి 25, 2021, ఏప్రిల్ 5, 2021న సంస్థకు సంబంధించిన డేటా ప్రాసెసర్ అటాక్‌కు గురైనట్టుగా గుర్తించింది. ఈ నేపథ్యంలో సంబంధిత కస్టమర్లు తమ పాస్‌వర్ట్స్ మార్చుకోవాలని సూచించింది. డేటా సెక్యూరిటీ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, లోపాలు తలెత్తిన సర్వర్‌లకు సెక్యూరిటీ కల్పించడం, ఎయిర్ ఇండియా ఫ్రీక్వెంట్ ఫ్లయింగ్ ప్రోగ్రామ్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌లను రీసెట్ చేయడంతో పాటు డేటా భద్రతను నిర్ధారించడానికి పరిష్కార చర్యలు తీసుకున్నామని వివరించింది.



Next Story

Most Viewed