లోక్ అదాలత్ సభ్యునిగా న్యాయవాది తిరుమలరావు నియామకం

94

దిశ, భద్రాచలం టౌన్ : లోక్ అదాలత్ సభ్యులుగా ప్రముఖ న్యాయవాది పామరాజు తిరుమలరావుని నియమిస్తూ‌ మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్, భద్రాచలం జ్యూడీషియల్ ప్రథమశ్రేణి న్యాయమూర్తి సీ. సురేష్ ఉత్తర్వులు జారీ చేశారు. లోక్ అదాలత్‌లలో కక్షిదారులకి సహకరిస్తూ, ఇరువర్గాల మధ్య రాజీచేయించి కేసులని పరిష్కరించే దిశగా కృషి చేస్తానని, తనకి లోక్ అదాలత్ సభ్యునిగా అవకాశం ఇచ్చిన భద్రాచలం ప్రథమశ్రేణి న్యాయమూర్తి సురేష్‌కి, న్యాయవాది పామరాజు తిరుమలరావు తన కృతఙ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలరావుకి పలువురు న్యాయవాదులు, పట్టణ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.