ఎంఐఎం నేత కాల్పులు.., మాజీ కౌన్సిలర్ జమిర్ మృతి

by  |
ఎంఐఎం నేత కాల్పులు.., మాజీ కౌన్సిలర్ జమిర్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల ఎంఐఎం నేత జరిపిన కాల్పుల్లో మాజీ కౌన్సిలర్ జమిర్ మృతి చెందారు. డిసెంబర్ 18న ఆదిలాబాద్ జిల్లా తాటిగూలోని ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూఖ్ అహ్మద్ కు, మాజీ కౌన్సిలర్ సయ్యద్ జమీర్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. గతంలోనే జమిర్ – షారూఖ్ కు మధ్య విభేదాలున్నాయి. అయితే ఈ నేపథ్యంలో డిసెంబర్ 18న చిన్నపిల్లలు క్రికెట్ ఆడుతుండగా జరిగిన చిన్న గొడవ కాల్పులకు దారి తీసింది. దీంతో రెచ్చిపోయిన ఫారూఖ్ ఓ చేత్తో తుపాకీ, మరో చేత్తో కత్తితో వీరంగం సృష్టించాడు. ఫారూఖ్ ను జమిర్ నిలువరించేందుకు ప్రయత్నిస్తుండగా .. ఫారూఖ్ బాధితుడు జమీర్ పై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో జమిర్ తీవ్రంగా గాయపడడంతో ఆయన కుటుంబ సభ్యలు అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ కు చెందిన ఓ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జమిర్ మరణించినట్లు డాక్టర్లు దృవీకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Next Story

Most Viewed