కారును ఢీకొట్టిన బొలెరో

by  |
కారును ఢీకొట్టిన బొలెరో
X

దిశ, హైదరాబాద్: హైదరాబాద్ మహా నగరంలో కరోనా కారణంగా గత 50 రోజులుగా లాక్ డౌన్ అమల్లో ఉంది. ఇదే సమయంలో రోజూ రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ కర్ఫ్యూ కొనసాగుతోంది. రవాణా వ్యవస్థ బంద్ కావడంతో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. వాహనాలు రద్దీ లేని ఈ సమయంలో రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఎవరైనా ఊహిస్తారా.. కానీ, హైదరాబాద్ నగరంలో బొలెరో అతివేగంగా వచ్చి కారును ఢీకొట్టిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకున్నా కారు ముందు భాగం ఎడమ వైపు నుజ్జు నుజ్జు అయ్యింది.

వివరాల్లోకెళితే..మల్కాజిగిరి నుంచి ఓ యువకుడు తన తల్లిని బంజారాహిల్స్ ఫెర్నాండేజ్ హాస్పిటల్‌కు కారులో తీసుకెళ్తున్నాడు. అదే సమయంలో బంజారాహిల్స్ వెళ్లేందుకు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద యూ టర్న్ చేస్తుండగా.. సరిగ్గా అదే సమయంలో ఖైరతాబాద్ చౌరస్తా నుంచి కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు వెళ్తున్న బొలెరో వేగంగా వచ్చి కారును ఢీ కొట్టింది. దీంతో కారు ముందు భాగం ఎడమ వైపు టైరు విడిపోయింది. ఆ భాగం అంతా నుజ్జు నుజ్జు అయ్యింది. ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ, కారులో ప్రయాణిస్తున్న యువకుని తల్లి దాదాపు గంట సేపటి వరకూ షాక్ నుంచి బయటకు రాలేదు. ట్రాఫిక్ పోలీసు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రాలీని ఆపాడు. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. అయితే, మామిడి‌కాయలు లోడ్ కోసం విజయవాడ నుంచి వస్తున్నట్లు బొలెరో డ్రైవర్ చెప్పాడు. లాక్ డౌన్ వేళ పొరుగు రాష్ట్రం ఏపీ విజయవాడ నుంచి ఎలాంటి అనుమతులు లేకున్నా హైదరాబాద్‌కు రావడం గమనార్హం.

Tags: accident, hyderabad, bolero, car, in lock down time, corona times

Next Story

Most Viewed