ప్రపంచంలోనే తొలి ‘3డీ బంకమట్టి’ ఇల్లు

by  |
ప్రపంచంలోనే తొలి ‘3డీ బంకమట్టి’ ఇల్లు
X

దిశ, ఫీచర్స్ : ఫ్రాన్స్‌‌లోని లోయిర్ వ్యాలీలో ఉన్న చాటేయు డి చాంబోర్డ్(Château de Chambord) నుంచి ఫ్లోరిడాలోని సరసోటాలో గల ‘కా డిజాన్’(Ca’ d’Zan) వరకు ప్రపంచంలోని ఎన్నో ఐకానిక్ ఎస్టేట్స్.. సిమెంట్, కాంక్రీట్‌లతో నిర్మితమైనవే. కానీ మనం తరచుగా చూసే సిమెంట్/కాంక్రీటుకు బదులు మట్టితో తయారు చేసిన వరల్ట్స్ ఫస్ట్ 3డీ ప్రింటెడ్ ఇంటిని ఇటాలియన్ ఆర్కిటెక్ట్ మారియో కుసినెల్లా సృష్టించాడు. ఇటాలియన్ నగరమైన రావెన్నాలో ఆవిష్కరించిన ఈ న్యూ ప్రాజెక్ట్ విశేషాలను మీరూ తెలుసుకోండి.

‘ఇల్లు కట్టి చూడు.. పెళ్లి చేసి చూడు’ అని పెద్దలు ఊరికే అనలేదు. ఈ పనులను దిగ్విజయంగా పూర్తిచేసిన వారికే అందులోని కష్టమేంటో తెలుస్తుంది. అందుకే ఈ రెండింటిని మనిషి జీవితంలో అతిపెద్ద అచీవ్‌మెంట్స్‌‌గా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సగటు మనిషి సొంతింటి కల నెరవేరాలంటే.. లక్షల రూపాయలతో పాటు ఓ ఆరునెలల సమయం వెచ్చించక తప్పదు. ఇలాంటి ‘హౌసింగ్ క్రైసిస్’‌కు పరిష్కారం చూపించే నేపథ్యంలో ఆర్కిటెక్ట్ కుసినెల్లా వరల్డ్స్ ఫస్ట్ 3డీ ప్రింటెడ్ క్లే హౌస్‌కు రూపకల్పన చేశాడు. ఈ ఇంటిని కూడా కేవలం 200 గంటల్లో కట్టడం విశేషం. దీని పేరు ‘టెక్లా’(Tecla) కాగా, ఇటాలియన్ రచయిత ఇటలో కాల్వినో కాల్పనిక నగరం థెక్లా(Thekla) నుంచి ప్రేరణ పొంది ఈ పేరును నిర్ణయించారు. అయితే ఈ 21వ శతాబ్దపు కట్టడం.. పురాతన నిర్మాణ పద్ధతిని మరోసారి స్ఫురణకు తెచ్చింది.

రౌండ్ ఇగ్లూ ఆకారంలో ఉన్న ‘టెక్లా’ ఇల్లు రెండు వృత్తాకారపు గోపురాలను కలిగి ఉండగా, స్థానికంగా లభించే బంకమట్టితో ఈ నిర్మాణాన్ని చేపట్టారు. పైగా జీరో ఎమిషన్స్ విడుదల చేసే ఈ పర్యావరణహిత ఇల్లు.. సుమారు 60 చదరపు మీటర్ల(645 చదరపు అడుగులు) విస్తీర్ణంతో నాలుగు మీటర్ల ఎత్తులో ఉంటుంది. బాత్రూమ్‌తో పాటు లివింగ్ రూమ్, కిచెన్, నైట్ జోన్ కలిగి ఉన్న ఈ ఇంటిని నిర్మాణానికి 60 క్యూబిక్ మీటర్ల సహజ పదార్థాలను(రా మెటీరియల్స్) వాడటం విశేషం. ఇవి సాధారణ సింథటిక్/కాంక్రీట్ నిర్మాణ సామగ్రి ఉత్పత్తి చేసే హానికరమైన ప్రభావాలను తగ్గించడమే కాక, అంతర్నిర్మిత ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఉదాహరణకు, టెక్లాకు ఉపయోగించిన స్థానిక బంకమట్టి సెల్ఫ్-ఇన్సులేటింగ్, అంటే ఇది వేడిని లోపలికి రాకుండా అడ్డుకోవడమే కాకుండా ఎండాకాలంలో చల్లగా, చలికాలంలో వెచ్చగా ఉంచుతుంది. ఉష్ణాన్ని, చల్లదనాన్ని రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, ఎయిర్ కండిషనర్ లేదా కొలిమి(ఫర్నేస్) అవసరమే ఉండదు.

ఇటలీకి ఉత్తరాన లేదా ఆఫ్రికా మధ్యలో లేదా అమెరికాలో ఎక్కడైనా ఈ ఇంటిని ముద్రించుకోవచ్చు. కాకపోతే వేర్వేరు వాతావరణాలకు అనుగుణంగా మార్చుకుంటూ నిర్మించుకోవాలి. భవిష్యత్తులో 3డీ ప్రింటెండ్ నిర్మాణాలు ప్రజలకు కొంత స్వేచ్ఛ ఇస్తాయి’ అని కుసినెల్లా అన్నారు.


Next Story

Most Viewed