అమెజాన్ పార్శిల్లో ఆ వస్తువులు.. ఖంగుతిన్న కస్టమర్

by  |
అమెజాన్ పార్శిల్లో ఆ వస్తువులు.. ఖంగుతిన్న కస్టమర్
X

దిశ, వెబ్ డెస్క్: ఒకప్పుడు షాప్పింగ్ కి వెళ్లాలంటే అదో పెద్ద తలనొప్పి. ఉదయం అనగా వెళ్తే ఎప్పటికో కానీ ఇంటికి వచ్చేవారు కాదు. కానీ ఇప్పుడు ఏ వస్తువు కావాలన్నా ఆన్ లైన్లో ఆర్డర్ పెట్టి , ఇంట్లోనే రిలాక్స్ గా కూర్చుంటున్నారు. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లాంటి ఆన్ లైన్ సంస్థలు ఇంటివద్దకు వచ్చి ఆర్డర్ ను డెలివరీ చేస్తున్నాయి. అయితే ఈ ఆన్ లైన్ డెలివరీలలో అనేక మోసాలు జరుగుతున్నాయి. వస్తువు మనచేతికి వచ్చేవరకు గ్యారెంటీ ఉండడంలేదు. తాజాగా ఈ ఆన్ లైన్ మోసానికి కడపకు చెందిన ఒక వ్యక్తి బలయ్యాడు.

కడప జిల్లాకు చెందిన ప్రదీప్ అనే వ్యక్తి అమెజాన్ లో కంప్యూటర్ హార్డ్ డిస్క్ ఆర్డర్ పెట్టాడు. అది మంగళవారం సిద్దవటం రోడ్డులోని సర్వీసు సెంటర్‌కు పార్శిల్ వచ్చింది. దీంతో అతడు రూ. 3,009 లు కట్టి ఆ పార్సిల్ ని తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి పార్సిల్ ని ఓపెన్ చేసి షాకయ్యాడు. హార్డ్ డిస్క్ ఉండాల్సిన ప్లేస్ లో రెండు సబ్బు పెట్టెలు ఉండడంతో ఖంగుతిన్న ప్రదీప్ వెంటనే డెలివరీ బాయ్ కి ఫోన్ చేసి అడిగాడు. తమకేం తెలియదని, పార్శిల్ ఎలా వస్తే అలాగే తీసుకొచ్చామని వారు తెలిపారు. దీంతో ప్రదీప్ పోలీసులకు ఫిర్యాదు చేసి, తన డబ్బు తనకు ఇప్పించవలసిందిగా కోరాడు.


Next Story

Most Viewed