పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం…

72

దిశ, కామారెడ్డి : తల్లి మృతి పై అనుమానాలు ఉన్నాయంటూ జిల్లా ఎస్పీని ఆశ్రయించిన కూతురు. కామరెడ్డి జిల్లా కేంద్రంలో గత 75 రోజుల క్రితం ఓ మహిళ మృతి చెందింది. అయితే తమ తల్లి గుండెపోటుతో చనిపోలేదని , ఆస్తి కోసమే తనను హత్య చేశారనే అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెకూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కూతురి ఫిర్యాదు మేరకు బుధవారం పోలీసులు తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

వివరాల ప్రకారం .. బ్రాహ్మణ పల్లికి చెందిన నజీమా బేగం భర్త చనిపోవడంతో కూతురు అస్మా బేగం వద్ద జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో నివాసం ఉంటుంది. ఇటీవల కూతురు ప్రేమ వివాహం చేసుకుంది. ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసిప్షనిస్ట్ గా అస్మాబేగం పని చేస్తోంది. ఆమె ఆస్పత్రికి వెళ్లిన సమయంలో తల్లి నజీమా బేగం మృతి చెందింది. గుండెపోటుతో మృతి చెందిందని మేనమామ షఫీ, భర్త వెంకటస్వామి అస్మాకు తెలిపారు. దానితో అది నిజమేనని నమ్మిన అస్మా తమ స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే కొద్దిరోజులుగా తన భర్త , మేనమామల ప్రవర్తన వింతగా ఉండటంతో అస్మాకు అనుమానం వచ్చింది. నజీమా బేగం తల్లి పేరున ఉన్న రూ. 20 లక్షల విలువ చేసే ఆస్తిలో నజీమా ఎక్కడ వాటా అడుగుతుందోననే ఆలోచనతో భర్త వెంకట స్వామితో కలిసి మేనేమామ షఫీ హత్య చేసి ఉంటారని అస్మా అనుమానం వ్యక్తం చేస్తూ తన తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయని జిల్లా ఎస్పీని ఆశ్రయించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..