‘మసూద్‌ను 18వ తేదీలోపు అరెస్ట్ చేయండి’

51

దిశ, వెబ్‌డెస్క్: జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత, పుల్వామ దాడి ప్రధాన సూత్రదారి మసూద్ అజర్‌పై పాకిస్తాన్ కోర్టు సంచలన ప్రకటన వెల్లడించింది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చుతున్న కేసులో అంతర్జాతీయ ఉగ్రవాది, నిషేధిత జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌ను ఈ నెల 18వ తేదీలోపు అరెస్ట్ చేయాలంటూ పాక్ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు పంజాబ్ పోలీసులను తాజాగా ఆదేశించింది. అజర్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసిన గుజ్రన్‌వాలలోని ఏటీసీ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. అంతేగాకుండా 18వ తేదీలోపు మసూద్‌ను అరెస్ట్ చేసి తమ ఎదుట ప్రవేశపెట్టాలని కౌంటర్ టెర్రరిజం విభాగం (సీటీడీ)ని ఆదేశించిన ఏటీసీ గుజ్రాన్‌వాలా న్యాయమూర్తి నటాషా నసీం సుప్రా ఆదేశించారు.