మలక్‌పేటలో విషాదం

35

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం మహ్మద్ అజిమ్ అనే 60ఏళ్ల వ్యక్తి మూసీ కాలువలో దూకాడు. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. భారీగా వరద ఉధృతి ఉన్న నేపథ్యంలో ఆ వ్యక్తి అక్కడికి ఎందుకు వెళ్లి దూకాడన్నది తెలియరాలేదు. వ్యక్తిగత ఇబ్బందులతో మూసీ కాలువలో దూకాడా లేకుంటే ఇంకేమైనా కారణాలున్నాయా అని పోలీసులు ఆరా తీస్తున్నారు. వరద భారీగా వస్తుండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందులు వస్తున్నాయి.