ఆ రెస్టారెంట్‌లో మాస్కు ధరిస్తే ‘ఫైన్’ వేస్తారట.. ఎక్కడో తెలుసా.?

199

దిశ, వెబ్‌డెస్క్ : కరోనా వ్యాప్తి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో అమెరికాలో పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. ఆ సమయంలో ప్రజలంతా భౌతిక దూరం పాటించాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వైద్యులు, అధికారులు సూచించారు. మాస్కు ధరించని వారికి జరిమానా కూడా విధించిన సందర్భాలు ఉన్నాయి.

కానీ ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు మారిపోయాయి. కరోనా తీవ్రత క్రమంగా తగ్గడం.. వ్యాక్సినేషన్ ఎక్కువ శాతం పూర్తవడంతో పాజిటివిటీ రేటు తగ్గింది. ఈ క్రమంలోనే ఓ సందర్భంలో ఇకపై మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని ఆ దేశాధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాలిఫోర్నియాలోని ఫిడిల్‌హెడ్‌ కేఫ్‌ రెస్టారెంట్‌ అందరికీ షాక్ ఇచ్చే నిబంధన అమలు చేస్తోంది. రెస్టారెంట్‌లోకి మాస్క్‌ ధరించి వస్తే వారికి బిల్లుపై 5 డాలర్లు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. అయితే ఇలా వసూలు చేసిన డబ్బును స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వనున్నట్లు ఆ రెస్టారెంట్‌ యజమాని క్రిస్‌ కాస్టిల్‌మ్యాన్‌ తెలిపారు.