పంటను దున్ని… నాశనం చేసిన అధికారులు

by  |
పంటను దున్ని… నాశనం చేసిన అధికారులు
X

దిశ, హుజురాబాద్: తన భూమిలో వేసిన పంటను అధికారులు తొలగించారని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తు ఓ రైతు తహసీల్ ఆఫీసు ఎదుట బైఠాయించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఆకునూర్ గ్రామానికి చెందిన రావుల రాజిరెడ్డి అనే రైతు శుక్రవారం తహసీల్ ఆఫీసు ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వివరాళ్లోకి వెళితే… ఆకునూర్ గ్రామంలో తనకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూమి 1.20 ఎకరాలకు సంబంధించి పాస్ బుక్కు ఉన్నప్పటికీ అధికారులు దున్ని పంటను నాశనం చేశారని ఆరోపించారు. రెండు నెలల క్రితం సుమారు రూ. 60 వేల పెట్టుబడితో పత్తి వేసుకోగా రెవెన్యూ అధికారులు ట్రాక్టర్‌తో తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ ప్రశాంత్ రావు రైతు రాజిరెడ్డిని సముదాయించి చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చూస్తామని తెలపడంతో రైతు నిరసనను విరమించుకున్నారు. ఈ విషయంపై తహసీల్దార్ సురేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆ భూమిని ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం కొనుగోలు చేసిందని, గతంలో మంత్రి, కలెక్టర్, ఎమ్మెల్యే లు హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారని తెలిపారు. సంబంధిత రైతుకు ప్రభుత్వ భూమిని సాగు చేయవద్దని చెప్పినా పంట వేశారని, వినతిపత్రం ఇస్తే విచారణ చేపడ్తామని తెలిపారు.



Next Story