Rajnath Singh: సీడీఎస్‌, త్రివిధ దళాల అధిపతులతో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ కీలక భేటీ

by Prasad Jukanti |

సీడీఎస్‌, త్రివిధ దళాల అధిపతులతో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ భేటీ

Rajnath Singh: సీడీఎస్‌, త్రివిధ దళాల అధిపతులతో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ కీలక భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) హైలెవల్ మీటింగ్ నిర్వహించారు. ఇవాళ ఢిల్లీలో నిర్వహించిన సమావేశానికి డిఫెన్స్ సెక్రటరీ, సీడీఎస్ అనిల్ చౌహన్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ హాజరయ్యారు. ఈ సమావేశంలో భద్రతా పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సమీక్ష నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం అనంతరం నిన్న ఎల్వోసీ వెంట పాక్ డ్రోన్ల్ కనిపిచాయి. పాక్ చర్యలపై ఓ కన్నేసి ఉంచామని తోక జాడిస్తే పరిణామాలు ఊహించని రీతిలో ఉం టాయని ప్రధాని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బార్డర్ లో తాజా పరిస్థితులు, పాక్ దాడులకు పాల్పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలే అనే విషయంలో కీలక చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

Next Story