Ajit Doval : పాక్ ‘ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్’.. ప్రధాని మోడీతో అజిత్ దోవల్ భేటీ

by Prasad Jukanti |

పాక్ ‘ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్’ నేపథ్యంలో ప్రధాని మోడీతో అజిత్ దోవల్ భేటీ అయ్యారు.

Ajit Doval : పాక్ ‘ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్’.. ప్రధాని మోడీతో అజిత్ దోవల్ భేటీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత పీక్స్‌కు చేరిన నేపథ్యంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) కాసేపటి క్రితం ప్రధాని నరేంద్ర మోడీతో (Modi) భేటీ అయ్యారు. బార్డర్‌లో పాకిస్తాన్ బరితెగించి దాడులకు పాల్పడటం, ఆపరేషన్ సిందూర్‌కు (Operation Sindoor) పోటీగా పాక్ ఆర్మీ ‘ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్’ ప్రారంభించిన నేపథ్యంలో వీరిద్దరి భేటీపై మరింత ఉత్కంఠ ఏర్పడింది. అంతకుముందు త్రివిధ ధళాలతో భేటీ అయిన దోవల్ అనంతరం పీఎం నివాసానికి వెళ్లారు. అక్కడ మోడీతో భేటీ అయి తాజా పరిణామాలు, పాక్ చేపట్టిన ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్‌పై (Operation Bunyan Ul Marsoos) ప్రధానికి వివరించినట్లు తెలిసింది. అయితే, మరికాసేపట్లో విదేశాంగ శాఖ మీడియా సమావేశం నిర్వహించనున్నది. పాక్ చేస్తు్న్న దాడులు వాటిని భారత త్రివిధ దళాలు తిప్పికొడుతున్న తీరును మీడియాకు వివరించనున్నారు.

Next Story