పాపం సూర్యకుమార్ యాదవ్.. 26 రోజుల్లో నాలుగో గోల్డెన్ డక్‌

by Disha Web Desk 12 |
పాపం సూర్యకుమార్ యాదవ్.. 26 రోజుల్లో నాలుగో గోల్డెన్ డక్‌
X

దిశ, వెబ్‌డెస్క్: 2022 ఐపీఎల్‌లో ఓ మెరుపు మెరిసి వరుసగా భారత జట్టులో సూర్యకుమార్ యాదవ్ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. కానీ SKY గత కొన్ని రోజులుగా పేలవమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల్లో గోల్డెన్ డకౌట్‌గా చెత్త రికార్డును మోసుకున్నాడు. అలాగే ఎన్నో అంచనాలతో ప్రారంభమైన ఐపీఎల్ లో కూడా సూర్య చెత్త ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ముంబై తరఫున ఆడుతున్న సూర్య మూడో మ్యాచులోను డకౌట్ అయ్యాడు.

దీంతో 26 రోజుల్లో నాలుగో గోల్డెన్ డకౌట్ అయి చెత్త ఫామ్ ను కొనసాగించాడు. ఈ సీజన్ లో మూడు మ్యాచులు ఆడిన సూర్య కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో క్రికెట్ అభిమానులు సూర్యను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఆడటం చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలని, మరో యంగ్ ప్లేయర్ కు ఛాన్స్ ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా సూర్యను ట్రోల్ చేస్తున్నారు. మరి మిగిలిన మ్యాచుల్లోనైన సూర్య తిరిగి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి మరి.

Next Story

Most Viewed