వరుసగా విఫలమవుతున్న.. టాప్ ర్యాంక్‌లోనే ఉన్న టీమ్ ఇండియా ప్లేయర్

by Disha Web Desk 13 |
వరుసగా విఫలమవుతున్న.. టాప్ ర్యాంక్‌లోనే ఉన్న టీమ్ ఇండియా ప్లేయర్
X

దుబాయ్: ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో ముంబై తరఫున ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ వరుసగా విఫలమవుతున్న విషయం తెలిసిందే. అయితే, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మాత్రం టాప్ పొజిషన్‌లోనే కొనసాగుతున్నాడు. ఈ మేరకు పురుషుల టీ20 బ్యాటర్ ర్యాంకింగ్‌లను ఐసీసీ బుధవారం విడుదల చేసింది. దాని ప్రకారం, పాయింట్ల పట్టికలో సూర్యకుమార్ 906 రేటింగ్ పాయింట్స్‌తో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.

రెండో స్థానంలో పాక్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్ (811) ఉండగా, కెప్టెన్ బాబర్ ఆజామ్ (755), సౌతాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్ (748), న్యూజిలాండ్‌కు చెందిన డెవాన్ కాన్వే (745) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. అంతకు ముందూ 15వ స్థానంలోనే విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లోనూ ఇదే స్థానంలో ఉన్నాడు. కాగా, ఈ ఐపీఎల్‌లో సూర్యకుమార్ తొలి మూడు మ్యాచ్‌ల్లో 15, 1, 0 స్కోర్లు నమోదు చేశాడు. ఇక బౌలర్ల విషయానికొస్తే టాప్ 10లో భారత బౌలర్లెవ్వరూ లేకపోవడం గమనార్హం.

Next Story

Most Viewed