IPL 2023: మరో బిగ్ ఫైట్.. పంజాబ్‌తో బెంగళూరు ఢీ

by Disha Web Desk 13 |
IPL 2023: మరో బిగ్ ఫైట్.. పంజాబ్‌తో బెంగళూరు ఢీ
X

దిశ, వెబ్‌డెస్క్: IPL 2023లో భాగంగా మొహాలి వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మరో ఆసక్తికర పోరు జరగనుంది. ఈ సీజన్‌లో ఐదు మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో చేజేతులా ఓటమిని తెచ్చుకున్న ఆర్‌సీబీ.. మళ్లీ విజయాల బాట పట్టడంపై ఫోకస్ పెట్టింది. బ్యాటింగ్‌లో టాప్-3 మినహా మిగతా బ్యాటర్లు విఫలమవుతుండటం.. బౌలింగ్‌లో సిరాజ్ ఒక్కడే రాణిస్తుండటంతో ఆర్‌సీబీ విజయాలందుకోలేకపోతుంది. ఈ క్రమంలోనే బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌ను పటిష్టం చేయడంపై ఫోకస్ పెట్టింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ రాణిస్తుండగా.. యువ బ్యాటర్ మహిపాల్ లోమ్రోర్ దారుణంగా విఫలమవుతున్నాడు. గ్లేన్ మ్యాక్స్‌వెల్ కూడా సూపర్ ఫామ్‌లో ఉండగా.. దినేశ్ కార్తీక్, షెహ్‌బాజ్ అహ్మద్ విఫలమవుతుండటం జట్టు విజయవకాశాలను దెబ్బతీస్తోంది. ఈ ఇద్దరూ కూడా రాణిస్తే ఆర్‌సీబీకి తిరుగుండదు. బౌలింగ్‌లో సిరాజ్ మినహా అంతా విఫలమయ్యారు. హర్షల్ పటేల్, విజయ్ కుమార్ వైశాఖ్ ధారళంగా పరుగులిచ్చుకున్నారు. వ్యాన్ పార్నెల్ సైతం అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ విఫలమవుతున్నాడు.


పంజాబ్ కింగ్స్‌లో శిఖర్ ధావన్ కెప్టెన్సీలో బలంగా కనిపిస్తున్నది. అధర్వ తైడే, మాట్ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్ రాణించాలి. బౌలింగ్‌లో కగిసో రబడా పర్వాలేదనించిన మిగిలిన బౌలర్లు రాణించాలి. ఆల్‌రౌండర్ సామ్ కర్రాన్ మునుపటి గేమ్‌లో ప్రభావవంతమైన బౌలింగ్ గణాంకాలను (నాలుగు ఓవర్లలో 3/31) అందించాడు. అతను IPLలో కెప్టెన్సీ అరంగేట్రంలో మూడు వికెట్లు తీసిన మొదటి కెప్టెన్ అయ్యాడు. అయితే బ్యాట్‌తో కూడా రాణించాలి.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుది జట్టు(అంచనా):

విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్(కెప్టెన్), అనూజ్ రావత్/మహిపాల్ లోమ్రోర్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, షెహ్‌బాజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్(కీపర్), వానిందు హసరంగా/మైకేల్ బ్రేస్‌వెల్, వ్యాన్ పార్నెల్/డేవిడ్ విల్లే, కర్ణ్ శర్మ/విజయ్ కుమార్ వైశాఖ్, సిద్దార్థ్ కౌల్/ హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్

పంజాబ్ కింగ్స్ తుది జట్టు(అంచనా):

శిఖర్ ధావన్, అధర్వ తైడే, మాట్ షార్ట్, హర్‌ప్రీత్ సింగ్, సికందర్ రజా, సామ్ కర్రాన్, జితేష్ శర్మ, షారుక్ ఖాన్, హర్‌ప్రీత్ బ్రార్, కగిసో రబడా, అర్ష్‌దీప్ సింగ్.



Next Story