పృథ్వీ షాను ఆడించకపోవడం అర్థంలేనిది.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై టామ్ మూడీ ఫైర్

by Dishanational3 |
పృథ్వీ షాను ఆడించకపోవడం అర్థంలేనిది..  ఢిల్లీ క్యాపిటల్స్‌పై టామ్ మూడీ ఫైర్
X

దిశ, స్పోర్ట్స్ : ఢిల్లీ క్యాపిటల్స్ యువ బ్యాటర్ పృథ్వీ షాను టీమ్ మేనేజ్‌మెంట్ తొలి రెండు మ్యాచ్‌ల్లో బెంచ్‌కే పరిమితం చేసింది. ఢిల్లీ మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ తప్పుబట్టాడు. తాజాగా ప్రముఖ మీడియా సంస్థతో మూడీ మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రికెట్ అనుభవం ఉన్న భారత ఆటగాడిని ఆడించకపోవడం అర్థం లేనిదన్నాడు. అతను రాణించడం లేదని డగౌట్‌లో కూర్చోబెడితే పరుగులు రావన్నాడు. పృథ్వీ షాకు బదులు తొలి రెండు మ్యాచ్‌ల్లో రిక్కీ భుయ్‌‌ను తీసుకోగా.. అతను వరుసగా 3, 0 పరుగులతో నిరాశపరిచాడు. దీంతో పృథ్వీ షాను పక్కనపెట్టిన ఢిల్లీ మేనేజ్‌మెంట్ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐపీఎల్-17లో ఢిల్లీ ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. వరుసగా పంజాబ్, రాజస్థాన్ మ్యాచ్‌ల్లో పరాజయం పాలైంది. ఈ నెల 31న వైజాగ్ వేదికగా చెన్నయ్‌తో తలపడనుంది.


Next Story

Most Viewed