2024 టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు నేను 100 శాతం సిద్ధం: దినేష్ కార్తీక్

by Disha Web Desk 12 |
2024 టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు నేను 100 శాతం సిద్ధం: దినేష్ కార్తీక్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో ఆర్సీబీ జట్టు తరఫున ఆడుతున్న దినేష్ కార్తీక్ వరల్డ్ కప్ లో ఆడటంపై తన మనసులో మాట చెప్పాడు. ఈ సీజన్ లో ఆర్సీబీ జట్టు బౌలింగ్ సరిగ్గా లేకపోవడంతో అత్యంత దారుణంగా ఓడిపోతున్నప్పటికి బ్యాటింగ్ లో మాత్రం కార్తీక్ తనదైన పాత్ర పోషిస్తున్నాడు. భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడుతూ.. ఫోర్లు, సిక్సర్లు కొడుతున్నాడు. IPL 2024లో 205-ప్లస్ స్ట్రైక్ రేట్ తో ఆడుతున్న అతను.. ఈ సీజన్ లో ఇప్పటికే 226 పరుగుల చేసి మూడో స్థానంలో నిలిచాడు. దీంతో డీకేను వరల్డ్ కప్ 2024 లో కచ్చితంగా ఆడించాలనే డిమాండ్ మొదలైంది. కాగా ఆదివారం మధ్యాహ్నం కేకేఆర్ జట్టుతో ఆర్సీబీ జట్టు తలపడనుంది. ఈ క్రమంలో డీకే మాట్లాడుతూ.. తాను 2024 టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు నేను 100 శాతం సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. 39 ఏళ్ల వయస్సు ఉన్న డీకే.. రెండు సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలో జరిగిన T20 ప్రపంచ కప్‌లో భారత్ తరపున కార్తీక్ చివరిసారిగా కనిపించాడు, ఇక్కడ మెన్ ఇన్ బ్లూ సెమీఫైనల్స్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. కాగా ఈ వరల్డ్ కప్ లో దీనేష్ కార్తీక్ కు స్థానం దక్కుతుందా లేదా అనే విషయం తేలాలంటే.. వేచి చూడాల్సిందే మరి.



Next Story

Most Viewed