రిక్షా నడిపే వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష: ఆ కేసులో థానే కోర్టు కీలక తీర్పు

by Dishanational2 |
రిక్షా నడిపే వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష: ఆ కేసులో థానే కోర్టు కీలక తీర్పు
X

దిశ, నేషనల్ బ్యూరో: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన రిక్షా డ్రైవర్‌కు థానేలోని స్పెషల్ పోక్సో కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లో కెళ్తే.. కాషిమిరా ప్రాంతానికి చెందిన రిక్షా డ్రైవర్ రాజేష్ సింగ్ తన స్నేహితుడైన అంబికా సింగ్ యాదవ్ కుమార్తె(8)ను 2018 నవంబర్ 18న ఇంటికి తీసుకెళ్లి లైంగిక వేధింపులకు గురి చేశాడు. అనంతరం బాలిక కుటుంబ సభ్యులకు జరిగిన విషయాన్ని చెప్పగా..వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోక్సో చట్టం కింద రాజేష్ సింగ్‌పై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి కేసు విచారణలో ఉండగా నేరం రుజువు కావడంతో కోర్టు తాజాగా నిందితుడికి పదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. విచారణలో భాగంగా బాధితురాలు, ఆమె తల్లి సహా తొమ్మిది మంది సాక్షులను విచారించినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేక్ కడు తెలిపారు. అయితే బాధితురాలి తండ్రి నిందితుడికి రూ 20,000 అప్పు చెల్లించాల్సి ఉందని, అందుకే తప్పుడు ఫిర్యాదు నమోదు చేశారని నిందితుడి తరఫు లాయర్ వాదించగా న్యాయమూర్తి దానిని తోసిపుచ్చారు.


Next Story

Most Viewed