- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అత్తింటి వారి వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య
వరంగల్ మండలంలోని పైడిపల్లి గ్రామానికి చెందిన రావి రాకుల స్వాతి (26) అనే మహిళా గురువారం సాయంత్రం గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయగా ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందింది.

దిశ, వరంగల్ : వరంగల్ మండలంలోని పైడిపల్లి గ్రామానికి చెందిన రావి రాకుల స్వాతి (26) అనే మహిళా గురువారం సాయంత్రం గడ్డి మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేయగా ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందింది. పైడిపల్లి గ్రామానికి చెందిన రావి రాకుల స్వాతి కి అదే గ్రామానికి చెందిన రావిరాకుల నిరంజన్ కు ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. పెళ్లయిన తర్వాత నుంచి మృతురాలి భర్త, అత్త మృతురాలిని కట్నం తీసుకురమ్మని వేధించేవారు.
ఈ క్రమంలో పెద్దమనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీ జరిగిన భర్త నిరంజన్ వేధించడం ఆపలేదు. దీంతో ఈ నెల 5వ తేదీ గురువారం సాయంత్రం మృతురాలు గడ్డి మందు తాగి తన అమ్మకు చెప్పగా వెంటనే చికిత్స నిమిత్తం ఎంజీఎం హాస్పిటల్ కి తరలించారు. చికిత్స పొందుతూ స్వాతి ఉదయం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతురాలి తల్లి తలకోట్ల యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎనుమాముల ఇన్స్పెక్టర్ ఏ.రాఘవేందర్ తెలిపారు.






