ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం.. తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్ల 50 లక్షలు వసూలు

by Disha Web Desk 23 |
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం.. తెలుగు రాష్ట్రాల్లో రూ.4 కోట్ల 50 లక్షలు వసూలు
X

దిశ, హనుమకొండ : హనుమకొండ అదాలత్ జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన కొత్త వీరేశం ను సుబేదారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ జరపగా తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల పేరుతో మోసం చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న 9 సభ్యులు గల ముఠా భోగోతం బయటపడింది. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ దేవేందర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ లో గ్రూప్ వన్ ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయక నిరుద్యోగుల నుండి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి తప్పించుకు తిరుగుతున్న 9 మంది సభ్యుల గల ముఠాలోని వరంగల్ పిన్న వారి వీధికి చెందిన కొత్త వీరేశం ను అదుపు లోకి తీసుకున్నారు.

అతడిని ప్రశ్నించగా పోలీస్ శాఖలో అదనపు ఎస్పీగా పనిచేసి చనిపోయిన భాస్కర్ రావు భార్య శ్రీదేవి నుంచి కొడుకుకు ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ -1 ఉద్యోగం ఇపిస్తామని నమ్మించి 2 కోట్ల 50 లక్షలు తీసుకున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా మరికొంతమంది దగ్గర ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు ప్రాథమికంగా తెలిసిందని చెప్పారు. మొత్తం సభ్యుల ముఠాను అతి త్వరలో పట్టుకొని వివరాలను వెల్లడించనున్నట్లు చెప్పారు.నిందితుడు వీరేశం ఇంట్లో తనిఖీ చేయగా 25 లక్షల విలువచేసే నగదు బంగారం తో పాటు ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

పరారీ లో 8 మంది..

గూడూరు పవన్ కుమార్,పద్మజా కొత్త గోపీనాథ్, ఊటుకూరు శ్రీనివాసరావు, బుచ్చిబాబు, బోయినపల్లి రవీందర్రావు, కొత్త అరుంధతి, కొత్త పూజిత ఉన్నట్లు తెలిపారు.


Next Story

Most Viewed