లారీ ఢీకొని స్టాఫ్​ నర్స్​ మృతి

by Disha Web Desk 15 |
లారీ ఢీకొని స్టాఫ్​ నర్స్​ మృతి
X

దిశ, కూకట్​పల్లి : కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఓ మహిళను వెనుక నుంచి లారీ ఢీటొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సీఐ కృష్ణ మోహన్​ తెలిపిన వివరాల ప్రకారం కేపీహెచ్​బీ కాలనీలోని రవి హాస్పిటల్​లో స్టాఫ్​ నర్స్​గా పని చేస్తున్న ప్రశాంతి తన స్కూటీపై కేపీహెచ్​బీ కాలనీ నుంచి కూకట్​పల్లి వైపునకు వెళుతుండగా వెనుక నుంచి మితి మీరిన వేగంతో వచ్చిన లారీ ప్రశాంతి ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టడంతో ఆమె తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్​పై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు సీఐ కృష్ణమోహన్​ తెలిపారు.



Next Story

Most Viewed