ఏలూరు జిల్లాలో 13.64 కోట్ల ఆస్తి స్వాధీనం

by Disha Web Desk 18 |
ఏలూరు జిల్లాలో 13.64 కోట్ల ఆస్తి స్వాధీనం
X

దిశ,ఏలూరు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇఎస్ఎంఎస్ కింద చేపట్టిన సీజర్ మేనేజ్మెంట్ ప్రక్రియ ద్వారా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మొత్తంగా రూ.13.64 కోట్ల విలువైన నగదు,బంగారం,మద్యం,ఇతర వస్తువులు సీజ్ చేశామని జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ తెలిపారు. ఇందులో రూ.203.20 లక్షలు నగదు కాగా, రూ.10.17 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, రూ.136.15 లక్షల విలువైన మద్యం స్వాధీన పర్చుకున్నారు. జిల్లాలో ఎన్నికల ప్రచార అనుమతుల కోసం సువిధ /ఎన్ కోర్ ద్వారా అందిన అభ్యర్ధనలు ఇంతవరకు 2006 అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.

ఎన్నికల ప్రచార అనుమతుల కోసం సువిధ ద్వారా 2045 అభ్యర్ధనలు రాగా వాటిలో ఇంతవరకు 2006 అనుమతులు జారీ చేయగా మరో 39 పరిశీలనలో ఉన్నాయన్నారు. సి-విజిల్ ద్వారా 399 ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. మీడియాలో ఎన్నికల ఉల్లంఘనలకు వచ్చిన 106 ఫిర్యాదులు పరిష్కరించామన్నారు. ఎన్ జి ఎస్పీ పోర్టల్ ద్వారా 604 పిర్యాదులు స్వీకరించగా వాటిలో 603 పరిష్కరించబడ్డాయని మరోకటి పరిశీలనలో ఉన్నాయన్నారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ప్రజలు నగదు గాని ఇతర విలువైన వస్తువులు గాని ప్రయాణ సమయంలో తీసుకు వెళ్ళే సమయంలో అందుకు సంబంధించిన సరియైన ఆధార పత్రాలు తమ వద్ద ఉంచుకోవాలన్నారు.



Next Story

Most Viewed